బిగ్‌బాస్‌3 లోకి మరో ముగ్గురు.. ఎవరో తెలుసా?

బిగ్‌బాస్‌3 లోకి మరో ముగ్గురు.. ఎవరో తెలుసా?
x
Highlights

బిగ్‌బాస్‌3 నాలుగో కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్‌ జాఫర్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ వార్తా చానెల్‌ యాంకర్‌, హోస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన జాఫర్‌.. బిగ్‌బాస్‌...

బిగ్‌బాస్‌3 నాలుగో కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్‌ జాఫర్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ వార్తా చానెల్‌ యాంకర్‌, హోస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన జాఫర్‌.. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చాడు. జాఫర్ ఇంటర్వ్యూలు ప్రసిద్ధి పొందాయి. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న జాఫర్ బిగ్‌బాస్‌ ఇంట్లో ఎలా వేగుతాడో చూడాలి.

ఇక ఐదో కంటెస్టెంట్‌గా స్పైడర్‌, మహానుభావుడు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజ ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో హిమజ ఎంతవరకూ ఇతర కంటెస్టెంట్లకు ఏవిధమైన పోటీ ఇస్తారో? చూడాలి. ఆరో కంటెస్టెంట్‌గా ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే.. మిగతా కంటెస్టెంట్లను తన పాటలతో అలరించాడు. ప్రతీ సీజన్‌లో ఓ సింగర్‌ ఉండేట్లు చూసుకుంటున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు.. ఈసారి రాహుల్‌ సిప్లిగంజ్‌ను ఎంపిక చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories